ఏడుపు
అలా ఎంత ప్రేమ గా పిలిచినా ఎవ్వరూ రాకపోయే సరికి ఇలా చిన్నగా ఏడుపు మొదలయ్యింది
నీ గావించిన లంకెన్ నొక్కక ద్రోహము
నే లంకిన్చెద ఆరున్ ఒక్కటి రాగము
బ్లాగు పూల మొక్క
దానయ్య గారు బ్లాగులు రాసే తొలి రోజుల్లో అందరిని ప్రేమగా ఆహ్వానించే వారు
మచ్చు కి ఇలా
నా బ్లాగు పూల మొక్కకి సరి కొత్త టపా పూసింది
తేనెలొలుకు పలుకులతో పద పరిమళాన్ని నింపింది
ఝుమ్మని నీవు వచ్చి తుమ్మెద వలె వాలవే
భావ మకరందం స్వీకరించి లంకె పదుగురుకీ పంచవే
ఇతివృత్తం
అనగనగా ఒక ఊళ్ళో ఓ దారిన పోయే దానయ్య ,అతనిదో నొక్కుకు నోచుకోని బ్లాగు
ఆయన పేరు ఆయన బ్లాగు పేరు ఒకటే ,పేరే కాదు ఆయన తన్మయత్వం కూడా అటువంటిదే
నేనే బ్లాగు బ్లాగే నేను అనుకొని రాసేవారు
పాపం అతను ఎంత బాగా ఎంత కష్టపడి రాసినా ఎవ్వరూ క్లిక్కులు కొట్టేవారు కాదుట
దాంతో నిరాశ చెందిన దానయ్య క్రుంగి క్రుసించి మంచాన పడ్డారు
అటువంటి సమయంలో నేను ఆయన్ని కలవడం తటస్థించింది
ఆ పరిచయం స్నేహం గా మారే సరికి ఆయన వృత్తాంతం అంతా వినక తప్పలేదు
తీరా విన్నాకా నా గుండె చెరువవ్వకా మానలేదు
మొత్తం కాదు గాని ఆ చెరువు నుంచి పొంగి పొరలిన కొన్ని నీటి బొట్లను మాత్రం ఇక్కడ పొందు పరుస్తున్నాను
వ్యాఖ్యలు (3)
వ్యాఖ్యలు (7)
వ్యాఖ్యలు (2)