మరో పక్షి కూత

పక్షిని చూసి పెట్టిన కూత,పెట్టుకున్న వాత

క్లిక్కు నొక్కక బ్లాగులన్నీ వెక్కి వెక్కీ ఏడ్చెను
కిక్కు ఎక్కక మందు బుడ్డీ పక్కు పక్కున నవ్వెను
ముక్క ఒక్కటి రాక పేక బొక్క పెట్టీ పోయెను
మొక్కు మొక్కీ కొండ ఎక్కిన రొక్క మేదని అడిగెను

4 comments so far

  1. సూర్యుడు on

    చాలా బాగుంది :-)

  2. కొత్త పాళీ on

    చివరి అక్షరాన్ని కాస్త రాగయుక్తంగా సాగదీస్తే కానీ కోకిల గొంతు వినబడదు

  3. రాఘవ on

    నేను కూడా కొత్తపాళీగారితో ఏకీభవిస్తున్నాను. చివర్లో దీర్ఘం వుంటే భలే వుంటుంది. కోకిల కూ అంటుందికదా దీర్ఘంగా… అందుకు. మాత్రలు బాగా పట్టుకున్నారు. శభాష్.

    ఒక్కమాట మాత్రం చెప్పితీరాలి. మత్తకోకిల, తరలం — ఈ రెండింటిలో వున్న అందం అదే. పాడుకోవడానికి మిగతా వృత్తాలకన్నా చక్కగా చాలా అనువుగా వుంటాయి.

  4. sriku on

    నెనర్లు
    నాకు ఈ వృత్తాలు అవీ రావు , నేర్చుకోడానికి ప్రయత్నించినపుడల్లా కష్టంగా అనిపించి వదిలేస్తున్నాను , ఈ సారి ప్రయత్నిస్తాను


Leave a reply