సింహాసనం
నొక్కుకి నోచుకోపోడం అంటే మరీ బొత్తిగా కాదనుకోండి , మొదట్లో దానయ్య గారి బ్లాగు కి క్లిక్కులు వచ్చేవి, వ్యాఖ్యలు కూడా వస్తూ ఉండేవి. ఇంకా కొంత మంది ఆసక్తి పరులు ఈయన బ్లాగుకి లింకులు కూడా పెట్టుకున్నారుట . దాంతో ఆనందం పట్టలేక దానయ్య గారికి ఏదో సింహాసనం ఎక్కినంత ఫీలింగ్ కలిగిందిట
క్లిక్కులు కరతాళ ధ్వనులై ప్రతిధ్వనించ
లింకులు పూల హారంబులై ఎదనలంకరించ
వ్యాఖ్యలే బహుపరాక్కులుగ మారుమ్రోగ
నే బ్లాగు సింహాసనం బధిష్టించితిన్ !
5 comments so far
Leave a reply
అద్భుతమండి.
avunu adbutam
సార్/మేడం,
పద్యం బావుంది.
కాకపోతే సార్/మేడం, ఇలా దానయ్యలు మాత్రం ఇలాంటోళ్ళనడం లింగ వివక్ష కాదా సార్. పుంలింగాలన్నీ బాధ పడతాయి సార్. దానయ్యకు ఓ బార్ పెట్టి దానమ్మ అనండి సార్
– విహారి
నెనర్లు
విహారి గారూ పేరు మార్చి బీదరాసి బ్లాగమ్మ అని పెట్టమంటారా