నిందా మొర

దానయ్య గారు తన బ్లాగుకి క్లిక్కులు రాకపోవడానికి గల కారణం గురించి ఎంతొ పరిశోధన చేసి చివరికి
తాను నిమిత్తమాత్రుడనని కేవలం కూడలి చేతిలో కీలుబొమ్మ అని గ్రహించి
ఒక్కసారి చెరసాల లో బంధించబడిన ఆ రామదాసు ని గుర్తుకు తెచ్చుకొని
మన కూడలి రాముడిని నిందిస్తూ ఈ విధంగా మొర పెట్టుకున్నారు

లంకంత కొంప పెట్టి లంకెలు చూపించలేక
లంకణాలు మేము జేసె నీ నొక్కులు తినిపించలేక
నొక్కులన్నినీవు పొంది నెప్పులను మాకు మిగుల్చు
టెక్కునిక్కుల  క్రీడలు చాలించు కూడలీ !

గమనిక: ఇతివృత్త రీత్యా కేవలం హాస్యం కొరకు రాసినది తప్ప విమర్శించుటకు కాదని మనవి

ఇప్పటికి 2 వ్యాఖ్యలు

  1. radhika on

    దానయ్య పేరు చెప్పి మీరు ఇరగదీస్తున్నారుగా.చాలా బాగున్నాయి మీ పద్యాలు

  2. సిరిసిరిమువ్వ on

    బాగుంది మీ విలాపము.


Leave a reply