బ్లాగు పూల మొక్క
దానయ్య గారు బ్లాగులు రాసే తొలి రోజుల్లో అందరిని ప్రేమగా ఆహ్వానించే వారు
మచ్చు కి ఇలా
నా బ్లాగు పూల మొక్కకి సరి కొత్త టపా పూసింది
తేనెలొలుకు పలుకులతో పద పరిమళాన్ని నింపింది
ఝుమ్మని నీవు వచ్చి తుమ్మెద వలె వాలవే
భావ మకరందం స్వీకరించి లంకె పదుగురుకీ పంచవే
7 comments so far
Leave a reply
నేనొక బ్లాగు మొక్కకడ నిలచి క్లిక్కు మని మౌసునొక్కి
వ్యాఖ్యానించునంతలోనె బ్లాగ్లన్నియు జాలిగ నోళ్ళువిప్పి
మాలింకులమీద నొక్కవా మౌసని బ్లాగురుమన్నవి కూడలి సాక్షిగ
- ప్రభూ! అందుకని వ్యాఖ్యలు రాయలేకపోతున్నా ….
ఆచార్యదేవా, పేరడీ అదిరింది!
లాభంలేదు, గురువు గారిని “బ్లాగరుశ్రీ” (కరుణశ్రీ టైపులో) పిలావాల్సిందే.
ఇద్దరూ ఒక్క ముక్కలో చక్కగా చెప్పారు ,నేను గంట నుండి సత్యసాయి గారికి పద్య రూపంలో ఎలా ప్రతిస్పందిన్చాలా అని బుర్ర కొట్టుకుంటున్నాను, లాభం లేదని అర్ధం అయ్యింది
నాకు మధ్యలో ఈ దానయ్య గారి ఏడుపులు ఒకటి , ఏమి ఆలోచించనివ్వకుండా
ఆచార్య వర్యా .. సెబాసు
ఇరగ ఉన్నాయి, పద్యాల్లో ఛందస్సు పేరు వ్రాసి దానికి వికీ లింకు ఇస్తే ఇంకా బాగుంటుంది.
నాకు అంత జ్ఞానం ఎక్కడ ఏడ్చింది సార్ మీరు మరీను
పదో తరగతి పరీక్షల తరవాత తెలుగు లో మళ్లీ ఇదే రాయడం